85 జీవోకు వ్యతిరేకంగా నిరసనలు

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 85 రద్దు చేయాలంటూ గొలుగొండ మండలం కృష్ణదేవిపేట వైద్యాధికారులు డాక్టర్ హరి ప్రవీణ్, గాయత్రిలు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రభుత్వ వైద్యాధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి సమ్మెలో పాల్గన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 85తో క్లినిక్ లో 15 శాతం నాన్ క్లినిక్ లో పనిచేస్తున్న వారికి 30 శాతానికి కుదించడం అన్యాయమన్నారు.

సంబంధిత పోస్ట్