గురజాల: సికింద్రాబాద్ లో పల్నాడు వ్యక్తి సూసైడ్

కుటుంబ పోషణ భారమై, చేసిన అప్పులు తీర్చలేక గురజాల మండలంలోని జంగమేశ్వరానికి చెందిన పిట్లా వెంకటయ్య అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తన కూతురి పెళ్లి, ఇంటి నిర్మాణానికి అప్పు చేశాడు. చేసిన అప్పు తీర్చేందుకు హైదరాబాద్ లో కూలీగా పనిచేస్తున్నాడు. కానీ అప్పు భారం రోజురోజుకి ఎక్కువ కావడంతో మనోవేధనకు గురయ్యాడు. దీంతో ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్