భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో అడుగు పెట్టాడు. అతని భార్య రితికా మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టుకు అందుబాటులో లేడు. అయితే, తొలి టెస్టు మూడో రోజు ఆట జరుగుతున్న సమయంలోనే రోహిత్ పెర్త్‌కు చేరుకున్నాడు. దీంతో రెండో టెస్టులో అతడు ఆటడం ఖాయమని తెలుస్తోంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా ఆ మ్యాచ్ జరగనుంది.