బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ మ్యాచ్ భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అప్పర్ కట్‌తో విరాట్ కోహ్లీ స్టైలిష్ సిక్సర్ సాధించాడు. అయితే సరిగ్గా బౌండరీ రోప్ మీద పడిన బంతి అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది తలకు బలంగా తగిలింది. వెంటనే సిక్సర్‌ను పట్టించుకోకుండా సెక్యూరిటీ గార్డ్‌కు ఏమైందని విరాట్ కోహ్లీ కంగారు పడ్డాడు. ఫిజియో అతని వద్దకు చేరుకుని చికిత్స అందించాడు.