ప్రతి వార్డులో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు: కమిషనర్ నయుo

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్ ఆధ్వర్యంలో దోమల నివారణకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణంలోని ప్రతి వార్డులోని మురుగు కాలువల్లో లార్విక్- 25 మందు పిచికారి చేసి చల్లారు. దోమల లార్వా వృద్ధి చెందకుండా చనిపోతుందని తద్వారా దోమల నివారణ నూరు శాతం సాధ్యమవుతుందని కమిషనర్ వెల్లడించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్