అప్పట్లో మహానాడు శిక్షణా తరగతుల్ని విజయవంతం చేసిన ఘనత. తనకు ఉందని ప్రస్తుతం జరుగుతున్న మహానాడులో నైనా చంద్రబాబు మనస్తత్వం మారలేదని దీంతో అసంతృప్తి చెంది పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ హయాంలోనే కష్టపడిన ప్రతీ కార్యకర్తకీ విలువ ఉండేదని, ఆ యన చనిపోవడంతోనే ఆ పార్టీ విలువలు కోల్పోయిందని చెప్పారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో కరోనాతో మరణించిన కార్యకర్తలను కూడా టీడీపీ ఆదుకోకపోవడం తనని ఎంతో బాధించిందని చెప్పారు.
గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్ ని కూడా గాలిలో పెట్టారని. నలభైఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ పార్టీ కార్యాలయంతో పాటూ కార్యాలయం చుట్టుపక్కల ఉన్న ప్రజల అభివృద్ధికి ఎందుకు కృషి చేయలేకపోయారని ప్రశ్నించారు. త్వరలో పార్టీ మారే అంశం పై సహచరుల తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని, ఆ తర్వాత నలుగురికి ఉపయోగపడే మంచి వ్యక్తిగా పనిచేస్తానని స్పష్టం చేశారు.