అమలాపురం రూరల్ మండలం కామనగురువు బైపాస్ రోడ్డు పక్కన ఉన్న మద్యం షాప్ ను తొలగించాలని గ్రామస్థులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు స్పందనలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారుల సంబంధించి మద్యం షాప్ ను జనవాసాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్పందనలో ఫిర్యాదు చేశారు.