మద్యం షాపు తొలగించాలని అమలాపురం కలెక్టరేట్ వద్ద మహిళలు ధర్నా

కొత్తపేట మండలం అవిడి రేవు వద్ద నివాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో ఆదివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట మహిళలు ధర్నా చేపట్టారు. అనంతరం వినతి పత్రాన్ని కలెక్టరేట్ లో అందజేశారు. తక్షణమే దుకాణాన్ని తొలగించాలని నినాదాలు చేశారు. నాగ వరలక్ష్మి, హరిప్రియ, రవిశంకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్