కేరళ రాష్ట్రంలోని వయనాడ్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రియాంక గాంధీ విజయం సాధించటం హర్షణీయమని మలికిపురం మండలం లక్కవరానికి చెందిన పీసీసీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణంరాజు శనివారం హర్షం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీని ప్రజలు ఆశీర్వదించారని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీకి ఎక్కువ మెజార్టీ వచ్చిందని గుర్తు చేశారు. ఇది శుభ పరిణామమని పేర్కొన్నారు.