‘వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్’.. ఏపీకి అవార్డుల పంట

ఏపీకి ‘వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్’ అవార్డుల పంట పండింది. మొత్తం 29 పురస్కారాల్లో 10 రాష్ట్రానికే దక్కాయి. ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నుంచి రాష్ట్ర మంత్రి సవిత, ఆయా జిల్లాల కలెక్టర్లు అవార్డులు అందుకున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విభాగంలో గుంటూరు మిర్చి, ఇతర విభాగాల్లో బొబ్బిలి వీణ, చీరాల సిల్క్, వెంకటగిరి కాటన్ చీరలకు స్వర్ణాలు దక్కాయి. ధర్మవరం చీరలకు రజతం..  పలాస జీడిపప్పు, ఏటికొప్పాక బొమ్మలు, పెద్దాపురం సిల్క్‌కు కాంస్యాలు వచ్చాయి.

సంబంధిత పోస్ట్