పామిడిలో మురుగు కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. మురుగునీరు కాలువలో ముందుకు కదలక పోవడంతో దుర్వాసనతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు కాలవల్లో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను తొలగించకపోవడంతో మురుగునీరు నిలిచిపోయింది. దీంతో దోమలు దండయాత్ర చేసి, అనారోగ్య బారిన పడేలా చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.