శ్రీసత్యసాయి జిల్లా మడకశిర కు కళ్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్ లిమిటెడ్ రానుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మడకశిర మండల కేంద్రంలోని మురా రాయన హల్లి గ్రామంలో రూ. 1430 కోట్లతో వెయ్యి ఎకరాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమతో 565 మంది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని, పరోక్షంగా వందల మందికి ఉపాధి లభించనుందన్నారు.