తెలంగాణలోని ములుగు జిల్లా అడవుల్లో కొత్త జీవ వైవిధ్య సంపద వెలుగులోకి వచ్చింది. లక్నవరం, తాడ్వాయి, పస్రా అడవుల్లో నిర్వహించిన ప్రత్యేక సర్వేలో మొత్తం 60 రకాల కొత్త సీతాకోక చిలుక జాతులు గుర్తించబడ్డాయి. ఈ సర్వేలో దేశంలోని 8 రాష్ట్రాల వైల్డ్‌లైఫ్ విభాగాలు, వరల్డ్ వైల్డ్ ఫర్ నేచర్ (WWF) సంస్థల నిపుణులు పాల్గొన్నారు. మొత్తం 60 మంది పరిశోధకులు మూడు రోజుల పాటు ములుగు అడవుల్లో పర్యటించి సీతాకోక చిలుకల వివిధ జాతులను గుర్తించారు. ఈ సర్వేలో బయటపడ్డ కొత్త జాతులు తెలంగాణ జీవ వైవిధ్యానికి కొత్త అందాన్ని తెస్తాయని నిపుణులు పేర్కొన్నారు.