ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, కాలిఫోర్నియం అనే లోహం బంగారం కంటే 200 రెట్లు ఖరీదైనది. ఇది భూమి నుంచి లభించదు, శాస్త్రవేత్తలు అణు శాస్త్రాన్ని ఉపయోగించి దీనిని కృత్రిమంగా తయారు చేస్తారు. 1950లలో వెలుగులోకి వచ్చిన ఈ రేడియోధార్మిక మూలకం, అణు రియాక్టర్లలో భారీ మూలకాలపై న్యూట్రాన్ రేడియేషన్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఒక గ్రాము కాలిఫోర్నియం విలువ సుమారు 27 మిలియన్ డాలర్లు. దీనిని అణు రియాక్టర్లను ప్రారంభించడానికి, క్యాన్సర్ చికిత్సలో న్యూట్రాన్ మూలంగా ఉపయోగిస్తారు.