గర్భాన్ని 'పాజ్' చేసే జంతువులు.. ప్రకృతిలో అబ్బురపరిచే వింత

ప్రకృతిలో కొన్ని క్షీరదాలకు గర్భంలోని పిండం ఎదుగుదలను తాత్కాలికంగా నిలిపేసే ప్రత్యేక సామర్థ్యం ఉంది. దీన్ని ‘ఎంబ్రియానిక్‌ డయాపాజ్‌’ అంటారు. ఆహారం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాతే పిండం ఎదుగుదలను తిరిగి ప్రారంభిస్తాయి. కంగారూ, రో డీర్‌, ఆర్మడిల్లో, స్టోట్‌, సముద్రపు ఆటర్‌, నల్ల ఎలుగుబంటి, జెయింట్‌ పాండా, టామర్‌ వాలబీ వంటి జంతువుల్లో ఇది కనిపిస్తుంది. ఈ ప్రక్రియ సంతానం పుట్టే సమయాన్ని అనుకూల పరిస్థితులకు అనుగుణంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది.

సంబంధిత పోస్ట్

✕
✕