99 శాతం దాటిన జనన, మరణాల నమోదు!

భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా 2024లో జనన, మరణాల నమోదు అంచనాలలో 99 శాతం మార్కును దాటింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఓఆర్‌జీఐ) విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్‌ఎస్‌) నివేదిక ప్రకారం, దేశంలో అంచనా వేసిన మొత్తం జననాలలో 99.1శాతం (2,54,73,389 జననాలు), మరణాలలో 99.4శాతం (89,38,301 మరణాలు) అధికారికంగా నమోదయ్యాయి. 2023తో పోలిస్తే 2024లో జననాలు 1.1శాతం, మరణాల నమోదు 3.2శాతం పెరిగాయి. గత దశాబ్ద కాలంలో ఈ నమోదు ప్రక్రియ నిరంతరం మెరుగుపడుతూ రావడం విశేషం.

సంబంధిత పోస్ట్