ఆ విషయంలో టీడీపీని ఫాలో అవుతున్న బీఆర్ఎస్!

తెలంగాణ ఉద్యమాలతో రాటుదేలిన‌ కేసీఆర్.. రెండు దఫాలు సీఎంగా పనిచేశారు. మరోసారి ముచ్చటగా అధికారంలోకి వస్తామని భావించి బోర్లా పడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ పటిష్టత గురించి ఆయన పెద్దగా పట్టించుకోలేదు. క్యాడర్‌ను కూడా లైట్ తీసుకున్నారనే విమర్శలు కూడా వినిపించాయి. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌.. పార్టీ నిర్మాణం, కార్యాలయ కార్యకలాపాల విషయంలో టీడీపీని ఫాలో అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆ పార్టీలాగానే త‌మ పార్టీని నిర్వ‌హించేందుకు నేతలు సిద్దమవుతున్నారని స‌మాచారం.

సంబంధిత పోస్ట్