127 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలకులు తరలించిన బుద్ధుని పవిత్ర అవశేషాలు తిరిగి భారత్‌కి చేరాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్‌లో పంచుకుంటూ, ఇది దేశ సాంస్కృతిక వారసత్వానికి గర్వకారణమన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ పిప్రాహ్వాలో 1898లో తవ్వకాల్లో అవశేషాలు బయటపడ్డాయి. వాటిని యూకేకు తీసుకెళ్లిన బ్రిటన్ ప్రభుత్వం నుంచి ఇప్పటికి తిరిగి రప్పించారు.