యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ శాస్త్రజ్ఞులు తూర్పు ఆఫ్రికా చింపాంజీల 252 వీడియోలను విశ్లేషించి, అవి మనుషుల మాదిరిగా 8,500కు పైగా సంజ్ఞలను ఉపయోగించి సంభాషించుకుంటాయని కనుగొన్నారు. కరెంట్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, మానవ సంభాషణ విధానం వందల ఏళ్ల క్రితం చింపాంజీలతో విడిపోవడానికి ముందే ఉద్భవించి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ పరిశోధన మనుషులు, కోతులు పంచుకునే ప్రవర్తనా విధానాలపై వెలుగునిచ్చింది.