భారతదేశ రాజధాని న్యూఢిల్లీ నుండి నేపాల్‌లోని బేనీ మున్సిపాలిటీ వరకు నేరుగా బస్సు సర్వీసులు ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభమయ్యాయి. 1,400 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు 27 గంటలు పడుతుంది. ఈ సర్వీసు హిందూ, బౌద్ధ పుణ్యక్షేత్రమైన ముక్తినాథ్‌కు భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సర్వీసును ప్రారంభించారు. ఇది ఇరు దేశాల మధ్య తొలి ప్రత్యక్ష బస్సు సర్వీసు.