బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఆర్డినెన్సె అంటే ఏంటో తెలుసా? అసెంబ్లీ లేదా పార్లమెంట్ సమావేశాలు జరగనప్పుడు ఓ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలనుకుంటే దాన్ని కేబినెట్‌లో ఆమోదించి గవర్నర్‌కు పంపుతారు. వారు సంతకం చేశాక అది ఆర్డినెన్స్‌గా మారుతుంది. గెజిట్ పబ్లికేషన్ ద్వారా దాన్ని అమల్లోకి తీసుకొస్తారు. కాగా ఆ ఆర్డినెన్స్‌కు ఆరు నెలల కాల పరిమితి ఉంటుంది.