జీవితంలో ఒక్కసారి కూడా ఆకాశాన్ని చూడలేని జంతువు ఏదో తెలుసా?

పందులు తమ శరీర నిర్మాణం వల్ల మనుషుల మాదిరిగా తలను పూర్తిగా పైకెత్తి ఆకాశాన్ని చూడలేవు. వీటి మెడ కండరాలు, ఎముకలు చాలా గట్టిగా ఉండి, వెన్నెముక కదలికలు పరిమితంగా ఉండటమే దీనికి కారణం. తలను వెనక్కి వంచే సామర్థ్యం పందులకు ఉండదు. ప్రకృతిసిద్ధంగా ఇవి నేలపై ముక్కుతో వాసన చూస్తూ దుంపలు, వేర్లను వెతికి తినే నైజం కలిగి ఉంటాయి. అందుకే వీటి తల ఎప్పుడూ నేల వైపే ఉంటుంది. కళ్లు ఇరువైపులా ఉండటం వల్ల చుట్టూ చూడగలిగినప్పటికీ, నేరుగా ఆకాశాన్ని చూడటం పందుల శరీర ఆకృతికి అసాధ్యం.

సంబంధిత పోస్ట్

✕
✕