సిలికా జెల్ ప్యాకెట్లతో లాభాలెంటో తెలుసా?

కొత్త వస్తువులతో వచ్చే సిలికా జెల్ ప్యాకెట్లను చాలామంది పనికిరానివిగా భావించి పారేస్తుంటారు. కానీ ఈ చిన్న ప్యాకెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. స్మార్ట్‌ఫోన్ నీళ్లలో పడితే, బియ్యం డబ్బాలో పెట్టడం కంటే సిలికా జెల్ ప్యాకెట్లు ఉన్న బాక్స్‌లో వేస్తే తేమను వేగంగా పీల్చుకుని ఫోన్‌ను కాపాడతాయి. బంగారం, వెండి నగలు నల్లబడకుండా మెరిసేలా ఉంచడానికి, తేమను పీల్చుకునేందుకు జ్యువెలరీ బాక్స్‌లో వీటిని ఉంచవచ్చు. ముఖ్యమైన పత్రాలు, ఫోటోలు తేమ వల్ల పాడవకుండా, ఫంగస్ పట్టకుండా భద్రపరచడానికి ఫైల్స్‌లో లేదా బీరువాలో ఉంచవచ్చు. ఈ చిన్న వస్తువుల వల్ల ఖరీదైన వస్తువులను సులభంగా కాపాడుకోవచ్చు.

సంబంధిత పోస్ట్