భారతదేశంలో లక్షలాది మంది రోజూ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే రైలు టికెట్లపై కనిపించే H1, H2, A1, B1 వంటి కోడ్‌ల అర్థం చాలామందికి తెలియదు. H1, H2 కోడ్‌లు ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లను సూచిస్తాయి, వీటిలో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. A1, B1 కోడ్‌లు టూ టైర్ ఏసీ కోచ్‌లను, B1, B2, B3 కోడ్‌లు త్రీ టైర్ ఏసీ కోచ్‌లను సూచిస్తాయి. S1, S2 కోడ్‌లు నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లను, CC కోడ్ ఏసీ చైర్ కార్ కోచ్‌లను సూచిస్తుంది. ఈ కోచ్‌ల విభజన ప్రయాణికుల సౌకర్యం, ఛార్జీలను బట్టి ఉంటుంది.