మనదేశంలో కంటికి కనిపించకుండా ప్రవహిస్తున్న ఒకే ఒక్క నది ఏదో తెలుసా?

మనదేశంలో వందల నదులు ఉండగా, సరస్వతి నది మాత్రం కంటికి కనిపించకుండా భూగర్భంలో ప్రవహిస్తోందని శాటిలైట్ చిత్రాలు నిరూపించాయి. ఋగ్వేద కాలంలో హిమాలయాల నుండి అరేబియా సముద్రం వరకు ప్రవహించిన ఈ నది తీరంలోనే వేద, సింధు-సరస్వతి నాగరికతలు విలసిల్లాయి. సుమారు 4,000 ఏళ్ల క్రితం సంభవించిన భూకంపాలు, ఉపనదులైన యమున, సట్లెజ్ దారులు మారడం వల్ల ఈ నది ఎండిపోయి ఇసుక మేటల కిందకు చేరింది. వర్షాకాలంలో కనిపించే ఘగ్గర్-హక్రా నదీ మార్గమే ఒకనాటి సరస్వతి ప్రవాహమని పరిశోధకులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕