ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పండు ఏదో తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత పురాతన పండ్లలో అంజీర (అత్తి పండు) ఒకటిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు 11 వేల సంవత్సరాల క్రితమే మనుషులు అంజీర పండ్లను సాగు చేసినట్లు పురావస్తు ఆధారాలు లభించాయి. మధ్యప్రాచ్య ప్రాంతాల్లో నియోలిథిక్ కాలానికి చెందిన అంజీర పండ్ల అవశేషాలు బయటపడ్డాయి. ప్రాచీన ఈజిప్ట్, గ్రీక్, రోమ్ నాగరికతల్లో దీనిని ఆహారంగా, ఔషధంగా ఉపయోగించేవారు. ఖర్జూరాలు, దానిమ్మ వంటి పండ్లకు కూడా సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ, సాగు ఆధారాల ప్రకారం అంజీర అత్యంత పురాతనమైనదిగా పరిగణించబడుతుంది.

సంబంధిత పోస్ట్