అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడుల్లో పట్టుబడిన అక్రమ నగదు, విలువైన వస్తువులను ముందుగా పంచనామా చేసి, లెక్కలు నమోదు చేస్తారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని సంబంధిత కోర్టులో డిపాజిట్ చేస్తారు. కోర్టు అనుమతితో ఆ డబ్బును ప్రభుత్వ ఖజానా లేదా బ్యాంక్ లాకర్‌లో భద్రపరుస్తారు. దర్యాప్తు పూర్తయ్యాక, నిందితుడిపై ఆరోపణలు రుజువైతే, కోర్టు ఉత్తర్వుల మేరకు నగదు ప్రభుత్వానికి జప్తు అవుతుంది. ఆరోపణలు రుజువు కాకపోతే, ఆ డబ్బును సంబంధిత వ్యక్తికి తిరిగి అందజేస్తారు. బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల విషయంలోనూ కోర్టు ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటారు.