ప్రపంచంలో మొదట సిగరెట్ ఎక్కడ తయారైందో తెలుసా?

సిగరెట్ చరిత్ర 9వ శతాబ్దంలో మెక్సికో, మధ్య అమెరికాలోని మాయా నాగరికతతో ప్రారంభమైంది. వారు తంబాకును కాల్చి పీల్చేవారు. 16వ శతాబ్దంలో యూరప్ అన్వేషకులు ఈ అలవాటును గమనించి, స్పెయిన్‌లో ఆధునిక సిగరెట్ రూపుదిద్దుకుంది. పేదలు కాగితాల్లో చుట్టి 'సిగారిల్లోస్'గా కాల్చేవారు. 1830లో ఫ్రాన్స్‌లో 'సిగరెట్' పదం ప్రాచుర్యం పొంది, 1845లో వ్యాపారపరంగా తయారీ ప్రారంభమైంది. క్రిమియన్ యుద్ధం తర్వాత యూరప్‌లో వినియోగం పెరిగింది. బోన్సాక్ యంత్రం రోజుకు 1,20,000 సిగరెట్లు తయారు చేయడంతో, జేమ్స్ బుకానన్ డ్యూక్ పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభించి, సిగరెట్‌ను ప్రపంచవ్యాప్తం చేశాడు.

సంబంధిత పోస్ట్