నేపాల్‌ కరెన్సీ ఏ దేశం ముద్రిస్తుందో తెలుసా?

నేపాల్ రాష్ట్ర బ్యాంక్ (NRB) 430 మిలియన్ల 1,000 రూపాయల నోట్ల ముద్రణ బాధ్యతను చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. అతి తక్కువ బిడ్ సమర్పించిన ఈ చైనా కంపెనీ గతంలోనూ నేపాల్ కరెన్సీ నోట్లను ముద్రించింది. గత మూడు సంవత్సరాలలో నేపాల్ రాష్ట్ర బ్యాంక్ జారీ చేసిన ఏడు టెండర్లలో ఇదే కంపెనీని ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు 16.985 మిలియన్‌ డాలర్లు. కాగా, భారత్ కూడా గతంలో నేపాల్‌కు 50, 1,000 రూపాయల నోట్లను ముద్రించి ఇచ్చింది.

సంబంధిత పోస్ట్