ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ సుమారు రూ.120 కోట్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళా క్రికెటర్‌గా అగ్రస్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ రూ.75 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (రూ.43 కోట్లు) మూడో స్థానంలో, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (రూ.35 కోట్లు) నాలుగో స్థానంలో, భారత టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ.26 కోట్లు) ఐదో స్థానంలో నిలిచి టాప్-5లో ముగ్గురు భారతీయ క్రికెటర్లు చోటు సంపాదించుకున్నారు.