తుఫానులకు పేర్లు ఎవరు పెడతారో తెలుసా?

తెలుగు రాష్ట్రాల తీరం వైపు దూసుకొస్తున్న 'అర్నబ్' తీవ్ర తుఫాను నేపథ్యంలో.. తుఫానులకు పేర్లు పెట్టే విధానంపై ఆసక్తి నెలకొంది. వాతావరణ హెచ్చరికలు, విపత్తు నిర్వహణలో గందరగోళం లేకుండా ఉండేందుకు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఆధ్వర్యంలో 13 దేశాలు 169 పేర్లతో కూడిన జాబితాను రూపొందించాయి. తాజా తుఫానుకు బంగ్లాదేశ్ సూచించిన 'అర్నబ్' అనే పేరు పెట్టింది, దీనికి బెంగాలీలో 'సముద్రం' అని అర్థం. ఈ పేర్లు వివాదాలకు తావు లేకుండా 8 అక్షరాలకు మించకుండా నిర్ణయించడం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్

✕
✕