ఆదివారం సెల‌వు ఎందుకు ఉంటుందో తెలుసా?

బ్రిటిష్ పాలనలో కార్మికుల కఠిన పరిస్థితులకు నిరసనగా, భారత కార్మిక ఉద్యమ పితామహుడు నారాయణ్ లోఖండే నేతృత్వంలో జరిగిన సుమారు 7 ఏళ్ల పోరాటం ఫలితంగా, 1890 జూన్ 10న ఆదివారం అధికారికంగా వారాంతపు సెలవుగా ప్రకటించబడింది. ఇది కార్మికుల హక్కుల సాధనలో ఒక ముఖ్యమైన విజయం. క్రైస్తవ మత విశ్వాసాలు, భారతీయ సంప్రదాయంలో ఆదివారం ప్రాముఖ్యత కూడా ఈ నిర్ణయానికి దోహదపడ్డాయి. రోమన్ సామ్రాజ్యం నుంచి యూరప్, ఆపై బ్రిటిష్ పాలన ద్వారా భారత్‌కు ఈ సెలవు సంప్రదాయం విస్తరించింది. నేడు ఇది ప్రతి భారతీయుడి జీవితంలో భాగమైంది.

సంబంధిత పోస్ట్