రోడ్లపై తెలుపు, పసుపు గీతలు ఎందుకు వేస్తారో తెలుసా?

రోడ్డుపై ఉండే తెలుపు, పసుపు రంగు గీతలు వాహనదారుల భద్రత కోసం అత్యంత కీలకమైనవి. తెలుపు గీతలు ఒకే దిశలో ప్రయాణించే వాహనాలను వేరు చేస్తాయి. డాష్డ్ వైట్ లైన్స్ ఉంటే జాగ్రత్తగా లేన్ మార్చవచ్చు, కానీ సాలిడ్ లైన్స్ ఉన్నప్పుడు లేన్ మార్చడం నిషిద్ధం. ఇక పసుపు గీతలు ఎదురెదురుగా వచ్చే వాహనాల మార్గాలను సూచిస్తాయి. ముఖ్యంగా, డబుల్ సాలిడ్ ఎల్లో లైన్స్ ఉన్నచోట ఓవర్‌టేక్ చేయడం ప్రమాదకరం. రహదారి నియమాలను పాటిస్తూ, ఈ గీతల అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా వాహనదారులు సురక్షితంగా ప్రయాణించవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕