పదేళ్లలో రైతుల ఆదాయం 126% పెరిగింది: నీతి ఆయోగ్‌

కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్లలో వ్యవసాయ రంగం చరిత్రాత్మక వృద్ధిని సాధించిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. "2014-15 నుంచి 2024-25 మధ్య వ్యవసాయ రంగం సగటున 4.45% వృద్ధిరేటు నమోదు చేసింది. ఇదే కాలంలో రైతుల ఆదాయం 126% పెరిగింది. మత్స్యరంగం 9% వృద్ధి సాధించగా, పండ్లు, మసాలాలు వంటి అధిక విలువ గల పంటల వాటా పెరిగింది. సాగునీటి విస్తీర్ణం, పంటల బీమా, వ్యవసాయ రుణాలు గణనీయంగా పెరిగాయి. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా, బియ్యం ఎగుమతిదారుగా నిలిచింది" అని నీతి ఆయోగ్ తెలిపింది.

సంబంధిత పోస్ట్