గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఉన్న పాలిటానా నగరం ప్రపంచంలోనే మొట్టమొదటి చట్టబద్ధమైన సంపూర్ణ శాకాహార నగరంగా రికార్డు సృష్టించింది. 2014లో 200 మంది జైన సన్యాసులు చేపట్టిన నిరాహార దీక్ష ఫలితంగా ఈ నగరంలో మాంసం, గుడ్ల అమ్మకాలు, జంతు వధపై గుజరాత్ ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించబడుతుంది. జీవకారుణ్యానికి, అహింసకు ప్రతీకగా నిలిచిన ఈ నగరం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది.