ప్రపంచంలో మొట్టమొదటి రైలు ఏ దేశంలో నడిచింది?

ప్రపంచంలోనే మొట్టమొదటి ప్యాసింజర్ రైలు 1825 సెప్టెంబర్ 27న ఇంగ్లాండ్‌లో స్టాక్‌టన్-డార్లింగ్టన్ మధ్య నడిచింది. దీనికి 'లోకోమోషన్ నంబర్ 1' అని పేరు పెట్టారు. ప్రముఖ ఇంజనీర్ జార్జ్ స్టీఫెన్‌సన్ రూపొందించిన ఈ ఆవిరి యంత్రంతో నడిచే రైలు 12 మైళ్ల దూరాన్ని 15 మైళ్ల వేగంతో కవర్ చేసింది. భారతదేశంలో మొదటి ప్యాసింజర్ రైలు ఏప్రిల్ 16, 1853న ముంబై నుండి థానే వరకు 34 కిలోమీటర్ల దూరాన్ని 57 నిమిషాల్లో అధిగమించింది. ఈ రైలులో 400 మంది ప్రయాణించారు.

సంబంధిత పోస్ట్