ప్రపంచ పవర్‌ఫుల్ దేశాల సరసన భారత్

భారత్‌కు అరుదైన గౌరవం దక్కింది. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత్‌ను ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మూడు కీలక శక్తులలో ఒకటిగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో అభివర్ణించారు. ఆర్థికంగా, వనరుల పరంగా, అణ్వస్త్ర సామర్థ్యం పరంగా భారత్, చైనా, రష్యా బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తించాయి. SCO వేదికపై ఇరాన్‌పై జరిగిన సైనిక దాడులను ఖండిస్తూ 'బిష్కెక్ డిక్లరేషన్'ను సభ్య దేశాలు ఆమోదించాయి.

సంబంధిత పోస్ట్