ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులోనూ భారత్ ఘోర పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 121 పరుగులకే ఆలౌటై.. 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో 3 టెస్టుల సిరీస్‌ను 3-0తో కివీస్ క్లీన్‌స్వీప్ చేసింది. పంత్(64) క్రీజులో నిలదొక్కుకొని ఒంటరి పోరాటం చేసినప్పటికీ భారత జట్టుకి ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ 6 వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లు తీశారు.