కామారెడ్డి జిల్లా బాన్సువాడకు బుధవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రానున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న నిర్వహించే దీక్ష దివాస్ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పరిశీలించనున్నట్లు ఆయన చెప్పారు. త్వరలో బాన్స్వాడకు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా రానున్నారని అన్నారు.