తెలుగు రాష్ట్రాల్లో దర్శకుడు రాంగోపాల్వర్మపై 9 కేసులు నమోదయ్యాయి. అయితే ఆర్జీవీ కోసం పోలీసులు ఆరు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. తెలంగాణ, తమిళనాడు, కేరళలో ఆర్జీవీ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా, తాను ఎక్కడికీ పారిపోలేదని నిన్న ఆర్జీవీ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.