మణుగూరు: నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో బారులు తీరిన భక్తులు

మణుగూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు బారులు తీరారు. ముందుగానే భక్తులు స్నానాలను ఆచరించి స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తగు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్