హరియాణాలోని హిసార్ జిల్లా ఆర్యానగర్ గ్రామం ప్రేమ పెళ్లిళ్లను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పుట్టిపెరిగిన యువతీయువకులను తోబుట్టువులుగా పరిగణించాలని, వేరే గ్రామాల వారినే పెళ్లి చేసుకోవాలని గ్రామ పంచాయితీ స్పష్టం చేసింది. పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకుంటే ఆ జంటతో పాటు వారి కుటుంబాలను కూడా సామాజికంగా బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఈ నిర్ణయంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు ఊరి ప్రజల అభిప్రాయాల కోసం ఇంటింటి సర్వే కూడా నిర్వహించనున్నారు.