హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన‌ మహేష్ భగవత్

TG: హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ శుక్రవారం నాడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన 21 మంది ఐపీఎస్ అధికారుల భారీ బదిలీల్లో భాగంగా ఆయన ఈ పదవిని చేపట్టారు. గతంలో డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా పనిచేసిన 1995 బ్యాచ్ అధికారి మహేష్ భగవత్‌కు నగర భద్రతపై కీలక బాధ్యతలు అప్పగించారు. మరోవైపు, ఇప్పటివరకు కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕