శాంతి భద్రతల పరిరక్షణ సమయంలో పోలీసులు వ్యవహరించే తీరుపై బెల్లంపల్లి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఆర్ఐ అడ్మిన్ వామనుమూర్తి ఆధ్వర్యంలో శనివారం ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ విధ్వంసాలకు పాల్పడుతున్న సమయంలో నియంత్రించే విధివిధానాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి సబ్ డివిజన్ లోని సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.