మందమర్రి పాత బస్టాండ్ జయశంకర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలను ఇచ్చి 9 నెలల నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిడుతూ పాలన చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్నారని దీనికే ప్రజాపాలన దినోత్సవం అని పేరు పెట్టారని విమర్శించారు.