హర్మూజ్‌ ద్వీపంలో అద్భుతాలు

పర్షియన్, ఒమన్ సింధు శాఖల మధ్య ఉన్న హర్మూజ్ జలసంధి, పర్షియా నుండి మహాసముద్రాలకు ఏకైక సముద్ర మార్గం. ఈ వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్న హర్మూజ్ ద్వీపం, ఉప్పు గుహలు, విచిత్ర ఆకారాల రాతి నిర్మాణాలు, తినే మట్టి వంటి ప్రత్యేకతలతో పర్యాటక స్వర్గంగా విలసిల్లుతోంది. 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం, వేల సంవత్సరాలుగా జనావాసంతో ఉంది. మార్కోపోలో, ఇబన్ బటూటా వంటి యాత్రికులు సందర్శించిన ఈ ద్వీపం, గోవా, గుజరాత్ నుండి ఇరాన్‌లోని ఖేష్మ్ దీవికి వెళ్లే ఓడలకు విడిది కేంద్రంగా ఉండేది.

సంబంధిత పోస్ట్