కర్ణాటకకు చెందిన 38 ఏళ్ల మహిళలో ప్రపంచంలో తొలిసారిగా అరుదైన బ్లడ్ గ్రూప్ గుర్తించారు. ఈ గ్రూప్‌కు 'క్రోమర్ ఇండియా బెంగళూరు (CRIBI)'గా శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఆ మహిళకు హార్ట్ సర్జరీ సమయంలో బ్లడ్ గ్రూపును గుర్తించేందుకు పరీక్ష చేయగా.. ఏ బ్లడ్ గ్రూపుతోనూ ఆమె రక్తం మ్యాచ్ కాలేదు. దాంతో బ్రిటన్ ల్యాబ్‌కు నమూనాలు పంపగా.. 10 నెలల పరిశోధనలో క్రోమర్‌లో కొత్త యాంటిజెన్ ఉండటాన్ని గుర్తించి ఈ బ్లడ్ గ్రూప్‌ను ప్రకటించారు.