భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ లో మంథని నియోజకవర్గం, కాటారం మండలం, చింతకాని ఎంపిటీసి కుడుములు విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మంథని నియోజక వర్గ ఇంఛార్జ్ రేండ్ల సనత్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బిజెపి కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ కమలం కండువా కప్పి బిజెపి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసారు.