ప్రజా ప్రయోజన వ్యాజ్యం: ఎప్పుడు, ఎలా వేయాలి?

సమాజంలో అన్యాయాలు, అక్రమాలు, ప్రభుత్వ ఆస్తులకు, ప్రజాధనానికి, పర్యావరణానికి నష్టం కలిగించే అంశాలపై పౌరులు హైకోర్టు, సుప్రీంకోర్టులను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) ద్వారా ఆశ్రయించవచ్చని హైకోర్టు న్యాయవాదులు వివరిస్తున్నారు. పిల్‌ వేయడానికి అవగాహన అవసరమని, లేదంటే జరిమానా పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. వ్యక్తిగత లబ్ధి కాకుండా ప్రజా ప్రయోజనం కోసమే పిల్‌ వేస్తున్నట్లు అఫిడవిట్ సమర్పించాలని, కేసు ఖర్చు తానే భరిస్తున్నట్లు పాన్ కార్డుతో సహా సమర్పించాలని సూచించారు. విశాఖ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌, పరమానంద కట్టారా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా వంటివి పిల్‌ ద్వారానే వచ్చినవేనని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్