పుడ్ పాయిజన్‌ ఘటన.. హెడ్‌మాస్టర్‌ సస్పెండ్‌

నారాయణపేట జిల్లా మాగనూర్‌ హైస్కూల్‌ ఫుడ్ ‌పాయిజన్‌ ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కాంట్రాక్టును రద్దు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. భోజనం తిన్న కాసేపటికే 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్